JAKOVITCH

08/02/2012 15:52

బెస్ట్ టీమ్ ‘బార్సిలోనా’లారెస్ స్పోర్ట్స్ అవార్డులు



 నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)

ప్రతిష్టాత్మక ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డును గెలుచుకున్నాడు.

ఈ ఏడాది ‘అత్యుత్తమ క్రీడాకారుడి’గా అతను ఎంపికయ్యాడు.

టెన్నిస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించినందుకు ఈ పురస్కారం లభించింది.

వారం కిందట ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన జొకోవిచ్ వరుసగా

మూడు గ్రాండ్‌స్లామ్స్ (ఓపెన్ ఎరా) టైటిళ్లను గెలిచిన ఐదో ఆటగాడిగా రికార్డు సృష్టించిన

సంగతి తెలిసిందే.

 

బార్సిలోనా ఫుట్‌బాల్ జట్టు ‘ఉత్తమ టీమ్’ అవార్డును అందుకుంది. 

2011లో అత్యుత్తమ ప్రదర్శనతో స్పానిష్ లీగ్, చాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనా విజేతగా నిలిచింది.

లారెస్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన 47 మంది ప్రఖ్యాత క్రీడాకారులు ఈ విజేతలను ఎంపిక చేశారు.

‘ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు:  

          వివియన్ చెరియట్ (కెన్యా) లాంగ్ డిస్టెన్స్ రన్నర్ 5,10 thousands winner in Last World 

 

‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గోల్ఫ్ క్రీడాకారుడు డారెన్ క్లార్క్ (ఐర్లాండ్)కు దక్కింది. 

  ‘అసాధారణ ప్రతిభ (బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్)’ అవార్డు: రోరి మెక్లారాయ్ను

 

‘జీవితకాల సాఫల్య పురస్కారం’: బాబి చార్ల్‌టన్ (మాంచెస్టర్) పాతతరానికి చెందిన ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు  

అంగవైకల్య విభాగంలో అవార్డు: బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌

last year ప్రపంచ చాంపియన్‌షిప్ (దక్షిణకొరియా) రిలేలో పిస్టోరియస్ రజత పతకం సాధించాడు.